గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సిద్ధార్థ్ మల్హోత్రా

181
gic
- Advertisement -

వృక్షో రక్షతి రక్షితా: అన్న పెద్దల మాటలే ఈ సృష్టిని కాపాడుతాయని ప్రజల్లో ప్రకృతి చైతన్యం కలిగిస్తుంది. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. అందుకే, ప్రతినిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నినాదం వినిపిస్తూనే ఉంటుంది. మొక్కలు నాటడమే కాదు.. వాటిని కాపాడాలనే పచ్చని స్పృహని ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. 

ఇందులో భాగంగా బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొన్నారు. ముంబాయిలోని, అందేరి వెస్ట్ చిత్రకూట్ స్టూడియోలో తన తాజా సినిమా “యోధ” చిత్రీకరణలో పాల్గొంటున్న సిద్ధార్థ్.. సినిమా డైరెక్టర్లు సాగర్ అంబ్రే మరియు పుష్కర్ ఓజాతో కలిసి మొక్కలను నాటారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” గురించి తెలసుకున్న వెంటనే స్వయంగా మొక్కలు నాటడం విశేషం. అంతేకాదు, సినిమా ముహూర్తానికి ముందే మొక్కలు నాటి ఒక అద్భుతమైన సంప్రదాయానికి తెరతీసారు డైరెక్టర్లు.

ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “గ్రీన్ ఇండియా చాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా.“గ్రీన్ ఇండియా చాలెంజ్” గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ బాలు మున్నంగితో పాటు “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ. ఇతర సినిమా బృందం పాల్గొన్నారు.

- Advertisement -