నేటితో సిద్దిపేటలో టిడిపి ఖాళీ- మంత్రి హరీష్

40
harish rao

సీఎం కేసీఆర్,టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. తాజాగా ఈరోజు సిద్దిపేట టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండు భూపేష్ సహా 200 మంది వివిధ పార్టీల నాయకులు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. మంత్రి హరీష్‌ రావు స్వయంగా వారందరికీ గులాబీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేటితో సిద్దిపేటలో టిడిపి ఖాళీ అయిందని రాష్ట్రం ఏర్పడ్డాక పెను మార్పులు వచ్చాయని హరీష్ అన్నారు. తెలంగాణలో టిడిపినీ ప్రజలు ఆదరించరని ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. జిల్లాలో గోదావరి జలాలతో 1600 కోట్ల రూపాయల విలువ గల పంటలు పండుతున్నాయని, ఒకనాడు కాలం కాక కరువుతో పట్టణంలో అంబలి కేంద్రం ఏర్పాటు పెట్టుకునేవాళ్లమని, నేడు పసిడి పంటలు పండుతున్నాయని హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు.