ఆసక్తిరేపుతున్న ‘ఇష్క్’‌ ట్రైలర్..

34
Ishq

సౌత్ ఇండియాలోని ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం త‌ర్వాత మ‌ళ్లీ తెలుగులో వ‌రుస‌గా చిత్రాలు నిర్మించేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేసింది. ఇటీవ‌ల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో ‘ఇష్క్‌` అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సుప్రీమ్ హీరో సాయి తేజ్ రిలీజ్ చేశారు. మంచి యూత్ లవ్ స్టోరితో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రధానంగా ‘ఇష్క్’ సినిమా తెరకెక్కించినట్టు తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాను ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Ishq (Not a Love Story) Movie Trailer | Teja Sajja, Priya Varrier | Mahathi Swara Sagar