శ్రద్ధా కపూర్ ఒప్పుకుందా?

26
- Advertisement -

బాలీవుడ్ లో హీరోయిన్ గా నిరూపించుకున్నాకే సాహూ సినిమాతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ కి హిందీ సినిమాలు వరసగా షాకిస్తూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు శ్రద్ధా కపూర్ చూపు సౌత్ మీద పడింది. సౌత్ లో అవకాశం రావడమే ఆలోచించకుండా ఒప్పేసుకుంది. అందులోను ప్యాన్ ఇండియా స్టార్స్ ఛాన్సెస్ అంటే ఎందుకు ఒప్పుకోదు. అల్లు అర్జున్ తో పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్న సమయంలోనే తమిళ స్టార్ హీరో సూర్య మూవీ ఆఫర్ రాగానే శ్రద్ధా కపూర్ చటుక్కున ఒప్పేసుకుంది. సూర్యతో భారీ చిత్రమైన కర్ణ కి శ్రద్ధా కపూర్ సైన్ చేసిందట.

మరి స్టార్ హీరో ల సినిమాల్లో క్రేజీ హీరోయిన్ గా మారిన శ్రద్ధా కపూర్ కి మరో ఐటెం సాంగ్ చేసే అవకాశం వస్తే ఒప్పుకుంటుందా అనే అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రద్ధా కపూర్ కి సౌత్ లో పెరుగుతున్న అవకాశాలతో మంచి క్రేజ్ రావడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమాలో ఓ క్రేజీ స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ ని సంప్రదించారని న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ తో శ్రద్ధా కపూర్ ఐటెం సాంగ్ ఉంటుంది అంటున్నారు.

మరి శ్రద్ధా కపూర్ ఇప్పుడిప్పుడే సౌత్ లో ఎదుగుతున్న స్టార్ హీరోయిన్, మరి శ్రద్ధా కపూర్ ని వరుసగా ఐటెం సాంగ్స్ కోసం సంప్రదిస్తే ఎలా ?, కానీ ఆమె మాత్రం వచ్చిన ప్రతి ఐటమ్ సాంగ్ ను ఒప్పుకుంటుంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. దసరాకి ఈ సినిమా షూటింగ్ షురూ అవుతుందట.

Also Read:Modi:తెలంగాణకు మోడీ.. క్లారిటీ వచ్చేనా?

- Advertisement -