సైబర్ క్రైం పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆర్‌ఎస్పీ…. సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లను పట్టుకోవడానికి అహోరాత్రులు సైబర్ పెట్రోలింగ్ చేస్తున్న మన సైబర్ క్రైం పోలీసులకు.. ఎందుకో ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీ వాళ్లే కనిపిస్తున్నారు డీజీపీ అని మండిపడ్డారు.
ఈ రోజు ఎక్స్ వేదికగా మీకు అఫీషియల్‌గానే.. తెలంగాణ గళం మార్ఫింగ్ చేసి.. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఫొటోలను పంపిస్తున్నా.. ఇది ముమ్మాటికీ తెలంగాణ కాంగ్రెస్ కుట్ర అని నా అనుమానం అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.ఈ దుశ్చర్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా హింస చెలరేగే ప్రమాదం ఉంది. ఇది 196, 197, 351, 352, 353 బీఎన్ఎస్ కింద నేరం.. లీగల్ ఒపీనియన్ అని తాత్సారం చేయకుండా సుమోటోగా కేసు నమోదు చేసి నిందితులను పట్టుకుని మాకిచ్చినట్లుగానే వాళ్లకు కూడా Orwellian and Draconian నోటీసులు ఇస్తారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించిన లింకులు కూడా పంపుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
Also Read:త్వరలో భూభారతి టోల్ ఫ్రీ నెంబర్

