Modi:తెలంగాణకు మోడీ.. క్లారిటీ వచ్చేనా?

16
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 4,5 తేదీల్లో తెలంగాణలో పర్యటిచనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. సంగారెడ్డి లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థానపన చేసే దిశగా మోడీ పర్యటన సాగనుంది. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో హటాత్తుగా ప్రధాని తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారి పర్యటిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇక లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల గెలిచే దిశగా రాష్ట్రంలో బీజేపీ నేతలు విజయ సంకల్ప యాత్ర పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తు ముందుకు సాగుతున్నారు రాష్ట్ర కమలనాథులు. .

ఈ నేపథ్యంలో ప్రధాని మోడి తెలంగాణ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంచితే ప్రధాని పర్యటనలో భాగంగా లోక్ సభ సీట్లపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే సీట్ల కేటాయింపుపై కమలనాథులు గట్టిగానే దృష్టి సారించారు. పలు సీనియర్ నేతలకు సీట్లు కూడా కన్ఫర్మ్ చేసినట్లు వినికిడి. 17 లోక్ సభ స్థానాలకు గాను 8 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు టాక్.. అటు దేశంలోని లోక్ సభ స్థానాలను కూడా తెలంగాణ పర్యటన తర్వాత కన్ఫర్మ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 545 లోక్ సభ సీట్లకు గాను తొలి జాబితాలో 100 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందట.. తొలి జాబితాలోనే నరేంద్ర మోడీ, అమిత్ షా.. పేర్లు కూడా ఉండనున్నట్లు వినికిడి. మొత్తానికి ప్రధాని తెలంగాణ పర్యటన తర్వాత. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ లోక్ సభ స్థానాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 Also Read:పచ్చి కొబ్బరి తినడం మంచిదేనా?

- Advertisement -