డ్రగ్స్ కేసు: ఆ భామలు చెప్పిన నిజాలు..

184
Deepika
- Advertisement -

బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) దర్యాప్తు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ పై ఫోకస్ పెట్టి.. ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో భాగముందన్న అనుమానంతో ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇప్పటికే దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్ లను విచారించిన సంగతి తెలిసిందే.

విచారణలో వీరంతా ఒకే మాట చెప్పారని ఎన్సీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వీరిలో కొందరు తాము ఒక్కసారి కూడా సిగరెట్ తాగలేదని చెప్పారని, తమ వాట్స్ యాప్‌లో ప్రస్తావించిన ‘డూబ్’ అనే పదం హ్యాండ్ రోల్డ్ సిగరెట్స్ కు సంబంధించినదని వారు చెప్పారని అన్నారు. సుశాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటాడని తమకు తెలియదని అందరూ స్టేట్ మెంట్ ఇచ్చారని, అతనితో పెద్దగా పరిచయం కూడా లేదని స్పష్టం చేశారని ఎన్సీబీ అధికారి తెలిపారు.

ఇక వారి మొబైల్ ఫోన్లను సాంకేతికంగా విశ్లేషించేందుకే తీసుకున్నామని, వారంతట వారే తమ ఫోన్లను ఇచ్చారే తప్ప, బలవంతంగా తీసుకోలేదని ఎన్సీబీ అధికారి స్పష్టం చేశారు.మరోవైపు నెటిజన్లు సోషల్ మీడియలో పలు కామెంట్స్ చేస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారాలను పక్కన పెడితే మొబైల్ ఫోన్లలో ఉండే మరిన్ని వ్యవహారాలు వెల్లడయ్యే అవకాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీబీ ఆధీనంలో ఉన్న ఫోన్లలోని ఏ సమాచారం అయినా బయటకు పొక్కితే మాత్రం.. వారి జాతకాలన్ని బట్టబయలైనట్లే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -