డ్రగ్స్ వాడినట్టు వెల్లడించిన బాలీవుడ్ బ్యూటీ..

114
Shraddha Kapoor

బాలీవుడ్ సినీ పరిశ్రమలో‌ని కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్‌ వాడుతున్నట్లు తెలడంతో ఎన్సీబీ అధికారుకులు విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో శనివారం శ్రద్ధా కపూర్‌‌ను ఎన్సీబీ అధికారులు విచారించారు. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌తో ఈమె చిచ్చరే సినిమా చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ పార్టీ జరిగింది. ఆ పార్టీలో చాలా మంది డ్రగ్స్ తీసుకున్నారు. కానీ సుశాంత్ మాత్రం ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని శ్రద్ధా విచారణలో వెల్లడించింది.

ఆ పార్టీలో డ్రగ్స్ ఇచ్చినవాళ్లు ఎవరో తనకు తెలియదంటూ ఎన్సీబీ అధికారుకులకు శ్రద్ధా సమాధానమిచ్చింది. ఒకవేళ వాళ్లను చూస్తే మాత్రం వాళ్లను గుర్తు పడతానంది. ఈ విచారణలో శ్రద్దా కపూర్ తాను సీబీడీ అనే డ్రగ్స్ తీసుకున్నట్టు విచారణలో వెల్లడించింది. అంతేకాదు అపుడపుడు షూటింగ్ సమయంలో వ్యానిటీ వ్యాన్‌లో సుశాంత్ డ్రగ్స్ వాడినట్టు శ్రద్ధా వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే శ్రద్ధాతో పాటు దీపికా, సారా అలీ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు.