లఘు చిత్రాల షూటింగ్స్ వాయిదా

381
shootings
- Advertisement -

కరోనా వైరస్ ను అరికట్టేందుకు షార్ట్ మరియు డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మించే నిర్మాణ సంస్థలు, వ్యక్తులు షూటింగ్స్ వాయిదా వేసుకోవాలని కోరారు కరీంనగర్ ఫిలిం సొసైటి అధ్యక్షులు పొన్నం రవిచంద్ర. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన హెల్త్ ఎమర్జెన్సీకి అనుకూలంగా మరియు జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పలు చిత్ర పరిశ్రమలు, సినిమా విడుదలలు మరియు షూటింగ్‌లను వాయిదా వేసుకున్నాయి. థియేటర్లు మూసివేయబడ్డాయి. దేశం ప్రస్తుతం ఒక పెద్ద ఆరోగ్యపరమైన యుద్ధాన్ని ఎదుర్కొంటోందన్నారు. కరోనా అనే ఈ మహమ్మరిని దేశం నుండి తరిమి వేయాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది… అందులో భాగంగా మనం కూడా లఘు చిత్ర టెక్నీషియన్స్ తో పాటు వీటిలో నటించే నటి నటుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని మన కనీస బాధ్యతగా భావించి షూటింగ్స్ నిలిపివేయాలి. పరిస్థితి ప్రశాంతమైన తర్వాతే షూటింగ్స్ జరుపుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.

- Advertisement -