జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ షార్ట్‌ఫిలిం పోటీలను నిర్వహిస్తోంది. గత ఏడాది ‘ యువ చిత్రోత్సవం ’ పేరిట షార్ట్ ఫిలిం కాంపిటీషన్‌ను నిర్వహించిన సాంస్కృతిక శాఖ ఈసారి కూడా షార్ట్‌ఫిలిం పోటీలను నిర్వహిస్తోంది. ఈమధ్య చాలా మంది షార్ట్‌ఫిలింలు చేసి సినిమాలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ యువతను ప్రోత్సహించాలనే దృక్పథంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. 2018 తెలంగాణా రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ, “అవతరణ ఫిల్మోత్సవం” నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో ఉత్తమ చిత్రాలుగా ఎంపికైనవాటికి, వివిధ క్యాటగిరిలలో ఉత్తమంగా నిలిచిన వారికి నగదు బహుమతులు అందించనున్నారు.
అవతరణ ఫిల్మోత్సవం విధి విధానాలు : 20 నిమిషాల నిడివికి మించకుండా షార్ట్ ఫిలిమ్స్ ఉండాలి ఫిక్షన్ జానర్‌లో ఉన్న షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే అనుమతించబడతాయి. షార్ట్ ఫిలింను ప్రపంచంలో ఎక్కడ షూట్ చేసినా అది ఈ పోటీలకు అర్హత కలిగి ఉంటుంది. తెలంగాణా/తెలుగుభాషలో లేని షార్ట్ ఫిలిమ్స్ కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తప్పనిసరి. జూన్ 2 , 2017 తర్వాత పూర్తి చేయబడ్డ చిత్రాలు మాత్రమే అర్హమైనవి. యూట్యూబ్ , విమియో, ఏ ఇతర ఆన్ లైన్ ప్లాట్ ఫారంలో పెట్టని ఫిలిమ్స్ మాత్రమే అర్హమైనవి. షార్ట్ ఫిలిం పోటీలకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు మీ ఫిలింలో తప్పకుండ తెలంగాణ భాష లేదా తెలంగాణ ప్రాంతం లేదా తెలంగాణా సంస్కృతిని చూపించాలి. పైన చెప్పిన ఎదో ఒక థీమ్ లేని చిత్రాలు సెలక్షన్‌కు అనర్హం. మీ చిత్రం లో వ్యక్తులను, వర్ణాన్ని, కులాన్ని, వర్గాన్ని,మతాన్ని, ప్రాంతాన్ని, దేశాన్ని, భాషని, సంస్కృతిని కించపరచకూడదు. ఐదుగురు జ్యూరీ మెంబర్స్ నిర్ణయం అంతిమం.
బహుమతుల వివరాలు: ఉత్తమ మొదటి షార్ట్ ఫిలిం – రూ.50,000 ప్రైజ్ మనీ ఉత్తమ రెండో షార్ట్ ఫిలిం – రూ.40,000 ప్రైజ్ మనీ ఉత్తమ మూడో షార్ట్ ఫిలిం – రూ.30,000 ప్రైజ్ మనీ టాప్ 5 చిత్రాలకు రూ.10,000 చొప్పున ప్రైజ్ మనీ ఉత్తమ దర్శకుడు – రూ.20,000 ప్రైజ్ మనీ ఉత్తమ ఛాయాగ్రాహకుడు – రూ.20,000 ప్రైజ్ మనీ ఉత్తమ సంగీత దర్శకుడు – రూ.20,000 ప్రైజ్ మనీ ఉత్తమ ఎడిటర్ – రూ.20,000 ప్రైజ్ మనీ.
దరఖాస్తు చేయడానికి చివరి తేది మే 25, 2018 సెలక్షన్ లిస్టు మే 31 న ప్రకటించబడుతుంది. అవతరణ ఫిల్మోత్సవం జూన్ 2 నుండి జూన్ 5 వరకు జరుగుతుంది. సెలెక్ట్ కాబడ్డ అన్ని చిత్రాలు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రదర్శింపబడతాయి. సెలెక్ట్ కాబడిన అన్ని చిత్రాలకు భాష సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుండి పార్టిసిపేషణ్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఉత్తమ ఐదు చిత్రాలకు మెమెంటో , క్యాష్ ప్రైజులు, సర్టిఫికెట్స్ ప్రధానం చేయబడతాయి. ప్రభుత్వం నుండి సన్మానం ఉంటుంది. జూన్ 5 సాయంత్రం 6 గంటల నుండి గ్రాండ్ గా ఫిల్మోత్సవం బహుమతుల ప్రధానం రవీంద్రభారతి మెయిన్ హాల్ లో జరుగుతుంది. వివరాలన్నీ ఆన్లైన్ లో #TAFi2018 hashtag తో పోస్ట్ చేయబడతాయి. ఎంట్రీ ఫారం , హామీ పత్రం, పోస్టర్స్ , వర్కింగ్ స్టిల్స్, ట్రైలర్, 1080p ఫిలిం తో మీరు ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఏదైనా ప్రశ్నలకు +91 6302 19 2018 వాట్సాప్ లేదా కాల్ చేయోచ్చు. మిగతా వివరాలన్నీ ఈ లింక్ లో ఉంటాయని తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.