బంపర్ ఆఫర్ కొట్టేసిన అక్కినేని కోడలు

248
Sobhita
- Advertisement -

అక్కినేని నాగార్జున కోడలు శోభిత ధూళిపాళ బంపర్ ఆఫర్ కొట్టేసింది. పాతికేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటివలే అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమూవీలో ఆమె క్యారెక్టర్ కు మంచి స్పందన వచ్చింది. ఈసినిమాలో శోభిత తన అందం, నటనతో ప్రేక్షకులను అలరించింది. ఈమూవీ
విజయం తర్వాత శోభిత కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

దీంతో ఆమె నెట్ ప్లెక్స్ తో ఒప్పందం కుదుర్చుకుని పలు వెబ్ సిరీస్ లలో నటించింది. తాజాగా బాలీవుడ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది శోభిత. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో నటించేందుకు రెడీ అయ్యింది ఈ భామ. లారెన్స్ కాంచన్ 2 చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు హీరో అక్షయ్ కుమార్.

త్వరలోనే ఈసినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈసినిమాలో కథానాయకగా నటించేందుకు శోభితకు అవకాశం ఇచ్చాడు లారెన్స్. బాలీవుడ్ లో ప్రస్తుతం హార్రర్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో కొన్ని మార్పులతో కాంచన2ను తెరకెక్కించనున్నారు లారెన్స్. ఎది ఎమైనా ఒకే సినిమాతో బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది శోభిత ధూలిపాళ్ల.

- Advertisement -