ఫైలెట్ అభినందన్ మీసాలకు యూత్ లో పుల్ క్రేజ్..

272
Abhinandan
- Advertisement -

అభినందన్ వర్ధమాన్ ఇప్పుడు ఈపేరు ఇండియా, పాకిస్ధాన్ లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మిగ్ యుద్ధ విమానంలో పాకిస్థాన్ లోకి దూసుకెళ్లి, అక్కడ ప్రమాదవశాత్తూ పడిపోయి, ప్రాణాలతో తిరిగి ఇండియాకు వచ్చిన యోధుడు ఫైలెట్ అభినందన్. పాకిస్ధాన్ పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఇక్కడి విషయాలు మాత్రం వాళ్లకు చెప్పలేదు. దీంతో అభినందన్ కు భారత్ లో చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ముఖ్యంగా ఆయన మీసాలకు ఎక్కువ మంది అభిమానులయ్యారు.

 Abhinandan Sheving

అతని మీసాలు ఇప్పుడు యూత్ కు ఐకాన్ గా మారాయి. అచ్చం అభింనందన్ మీసాల లానే చేయించుకునేందుకు కటింగ్ షాపుల వద్ద యూత్ క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అభినందర్ మీసాల్ యూత్ లో ట్రెండ్ గా మారింది.

ముఖ్యంగా బెంగళూరులో ఈ డిమాండ్ అధికంగా ఉందని, అభినందన్‌ ధైర్య సాహసాలు ఆయన మీసకట్టులోనే ఉన్నాయని, అదే పాక్‌ సైనికులను భయపెట్టిందని యువత భావిస్తోంది. రియల్‌ హీరో అభి తరహా మీసకట్టు కోసం తనవద్దకు రోజుకు 15 మంది వరకూ వస్తున్నారని చెప్పారు బెంగుళూరు లోని హెయిర్ సెలూన్ యాజమాని. అభినందర్ రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు ఆయన అభిమానులు.

- Advertisement -