- Advertisement -
తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులగా శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అమ్మాయిలను లైగికంగా వేధిస్తున్నా, క్యాస్టింగ్ కౌచ్ పై ‘మా’ పెద్దలు పట్టించుకోవడం లేదంటూ మా అసోసియేషన్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపింది. అయితే తాజాగా మా పెద్దలు కూడా లైగింకంగా వేధించారని క్యారెక్టర్ ఆర్టిస్ట్ శృతి ఓ టీవీ ఛానల్ పేర్కొంది.
అయితే దీనిపై స్పందించిన శ్రీరెడ్డి “ది గ్రేట్ మా అధ్యక్షుడు శివాజీ రాజా గారూ… మీ టోకెన్ నంబర్ వచ్చింది. పదిమందికి న్యాయం చేయాల్సిన కుర్చీలో ఉండి ఈ రాసలీలలు ఏంటండీ?” అని ప్రశ్నించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ శృతి ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, మా అధ్యక్ష పదవికి శివాజీ రాజా అనర్హులని వ్యాఖ్యానించింది. తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని శ్రీరెడ్డి హెచ్చరించింది.
- Advertisement -