మహా సంకీర్ణ ప్రభుత్వానికి షాక్..!

67
uddhav
- Advertisement -

శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. మహా వికాస్ అఘాడి కూటమిలో క్యాంపు రాజకీయాల కలకలం రేపింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. సూరత్ క్యాంపులో నలుగురు మంత్రులు సహా మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. క్యాంపులోని ఎమ్మెల్యేలను సంప్రదించేందుకు శివసేన తీవ్ర ప్రయత్నాలు జరుపుతుంది.

ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర వికాస్ అగాడి బ‌లం 169 అందులో శివ‌సేన 56, ఎన్సీపి 53, కాంగ్రెస్ 44, స్వ‌తంత్రులు 16 మంది ఉన్నారు. బీజేపీ 106 ఎమ్మెల్యేల‌తో ప్ర‌ధాన ప్ర‌తిపక్షంగా నిలిచింది. ప్ర‌స్తుతం అసెంబ్లీ మ్యాజిక్ ఫిగ‌ర్ 143కాగా, బీజేపీకి మ‌ద్ద‌తుగా మ‌రో 7 గురు స్వతంత్రులున్నారు. ఫలితంగా అసెంబ్లీలో ఎన్డీఏకు 113 బ‌లం పెరిగింది.

మహరాష్ట్రలో సోమవారం 10 స్థానాలకు శాసన మండలి ఎన్నికలు జరిగాయి. కూటమి భాగస్వామ్య పార్టీలైన శివసేన రెండు, ఎన్సీపీ రెండు, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించారు. బీజేపీ పార్టీ నాలుగు మాత్రమే గెలుచుకునే సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఐదు స్థానాల్లో విజయం సాధించి ఆశ్చర్యం కలిగించింది.

- Advertisement -