- Advertisement -
ఐపీఎల్ 13లో అద్భుత ఫామ్‌తో అలరిస్తున్నాడు శిఖర్ దావన్.తన అద్భుత ఆటతీరుతో డీసి విజయాల్లో కీ రోల్ పోషిస్తున్న గబ్బర్ తాజాగా వరుస బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు సాధించి తన మార్క్ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.
ధావన్(101 నాటౌట్, 106 నాటౌట్)తో అరుదైన రికార్డు నెలకొల్పాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో 57 బంతుల్లో 12 ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేసుకున్నాడు. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ధావన్(101 నాటౌట్: 58 బంతుల్లో 14ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీ బాదాడు. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ ద్వారా ఐపీఎల్ లో 5వేల పరుగు మార్క్ ను దాటాడు.
- Advertisement -