షూటింగ్ ప్రారంభించిన హీరో‌ శ‌ర్వా..

83
Sharwanand

హీరో శ‌ర్వానంద్ లాక్‌డౌన్ స‌డ‌లింపుల త‌ర్వాత త‌న సినిమాల షూటింగ్‌ను పునఃప్రారంభించేందుకు త‌గిన స‌మ‌యం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఎట్ట‌కేల‌కు, నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ డైరెక్ట్ చేస్తోన్న పేరుపెట్ట‌ని సినిమా చివ‌రి షెడ్యూల్‌ను బుధ‌వారం పునఃప్రారంభించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ ద్విభాషా చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం చెన్నైలో జ‌రుగుతోంది.

ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్ మాట్లాడుతూ, “లాక్‌డౌన్ త‌ర్వాత మ‌ళ్లీ కెమెరా ముందుకు రావ‌డం, తాజా గాలిని పీలుస్తున్నంత హాయిగా ఉంది” అన్నారు. రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో అమ‌ల అక్కినేని, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై 2019లో ఖైదీ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని అందించిన ఎస్‌.ఆర్‌. ప్ర‌కాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్ర‌భు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తారాగ‌ణం:
శ‌ర్వానంద్‌, రీతూ వ‌ర్మ‌, అమ‌ల అక్కినేని, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిశోర్‌
సాంకేతిక బృందం:
నిర్మాత‌లు: ఎస్‌.ఆర్‌. ప్ర‌కాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్ర‌భు
ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌కార్తీక్‌
బ్యాన‌ర్‌: డ‌్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌