భువనగిరిలో మంత్రి కేటీఆర్ పర్యటన..

135
ktr tour

నేడు భువనగిరి పట్టణంలో పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటించనున్నారు. ఈ మేరకు కేటీఆర్‌ పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించారు. మంత్రి పర్యటన కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. భువనగరి పట్టణంలో పలు అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కలిసి పరిశీలించారు.

భువనగిరి పట్టణంలో డంపింగ్‌ యార్డు ఆవరణలో నిర్మిస్తున్న మానవ మలవ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం, వీధి విక్రయదారుల 25 షెడ్ల ప్రారంభోత్సవం, పలు వార్డుల్లో బీటీరోడ్లు, సవిూకృత మార్కెట్‌, నిరాశ్రయుల భవనం, స్మృతివనం, డంపింగ్‌యార్డు వద్ద పార్కు కాంపౌండ్‌వాల్‌ వంటి అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ రేపు వెళ్లనున్నారు.