యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ తన 30వ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో చేయనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ రోజు ఫస్ట్‌లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ఒకే ఒక జీవితం అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.
శర్వానంద్ వెనకాల గిటార్ వేసుకుని ఉండడం ఈ పోస్టర్లో మనం చూడొచ్చు. ఈ పోస్టర్‌లో ఒక వైపు పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. మరొక వైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్, ఫ్లైట్ ని చూపించారు. ఈ పోస్టర్ ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఉంది. శర్వానంద్ సరసన మన తెలుగమ్మాయి రీతు వర్మహీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.
జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తుండగా డియర్ కామ్రెడ్ ఫేమ్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగమయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సై – ఫై ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కి నచ్చే విధంగా ఉండబోతుంది. నిజానికి తల్లి-కొడుకుల బంధంతో ఉన్న సినిమాలు అన్ని వర్గాల వారికి నచ్చుతాయి. ఇప్పటికే ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తారాగణం: శర్వానంద్, రీతు వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: శ్రీ కార్తిక్
నిర్మాతలు:ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
మాటలు: తరుణ్ భాస్కర్
డిఓపి: సుజిత్ సారంగ్
సంగీతం: జేక్స్ బిజోయ్
ఎడిటర్: శ్రీజీత్ సారంగ్
ఆర్ట్: ఎన్. సతీష్ కుమార్
స్టంట్స్: సుదేశ్ కుమార్
స్టైలిస్ట్: పల్లవి సింగ్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కృష్ణకాంత్
పిఆర్ఓ : వంశీ – శేఖర్