అభివృద్ధి అంటే ఏమిటి..?

15
- Advertisement -

అభివృద్ధి అంటే ఏంటో చెప్పాలని కూటమి ప్రభుత్వానికి మాజీ ఎంపీ హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. అభివృద్ధి అంటే పరిపాలనా భవనాలు, నివాస భవనాలు, పార్కులు, కళా భవనాలు, విశ్రాంతి భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం కాదు అని లేఖలో పేర్కొన్నారు.

రోడ్ల నిర్మాణాలు, సాగునీరు, మురుగు కాల్వల నిర్మాణము, స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలన్నారు. విద్యా, వైద్య సౌకర్యం అతి ముఖ్యమైనవి. ఈ రకమైన చర్యలు చేపట్టడమే నిజమైన అభివృద్ధి అని…పాలకొల్లులో ఆధునిక వైద్య సదుపాయం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు.

అభివృద్ధి అంతా కేంద్రీకరిస్తూ ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ కోట్లాది రూపాయిలు ప్రజాధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు…అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. అదే ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు.

Also Read:TTD: శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

- Advertisement -