ఫిబ్రవరిలో శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’..

71
- Advertisement -

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రూపొందుతోన్న మైల్ స్టోన్ మూవీ ఒకే ఒక జీవితం. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు.

దీపావళి సందర్బంగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అక్కినేని అమల గోడపై కూర్చుని ఉన్నారు. శర్వానంద్, అతని తమ్ముడు అమ్మ ఒడిలో తల పెట్టుకుని అలా సేద తీరుతున్నారు. ఈ పోస్టర్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడుతున్నాయి.

తెలుగమ్మాయి రీతూ వర్మ ఈ చిత్రంలో శర్వానంద్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ చిత్రంలో భాగం అయ్యారు.

శర్వానంద్‌కు క్రేజ్ కి తగ్గట్టుగా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్‌ను ఆకట్టుకునేలా ఉండబోతోంది. తల్లీ కొడుకుల బంధం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

నటీనటులు : శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు

సాంకేతిక బృందం
రచయిత, దర్శకుడు : శ్రీ కార్తీక్
నిర్మాతలు : ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు
ప్రొడక్షన్ కంపెనీ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్
డైలాగ్స్ : తరుణ్ భాస్కర్
డీఓపీ : సుజిత్ సారంగ్
ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్
సంగీతం : జేక్స్ బిజోయ్
ఆర్ట్ డైరెక్టర్ : ఎన్ సతీష్ కుమార్
స్టంట్స్ : సుదేష్ కుమార్
స్టైలిష్ట్ : పల్లవి సింగ్
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్
పీఆర్వో : వంశీ-శేఖర్

- Advertisement -