ధోనికి ధన్యవాదాలు తెలిపిన వాట్సన్‌..

62
dhoni

మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన వాట్సన్…ఐపీఎల్‌కు మాత్రం ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై ఘోరంగా విఫలం చెందడంతో ప్లే ఆఫ్‌కు చేరకుండానే లీగ్ దశలోనే టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. దీంతో అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్‌.

ఈ నేపథ్యంలో చెన్నై జట్టుతో మూడేళ్ల అనుబంధంపై స్పందించాడు వాట్సన్‌. తనపై నమ్మకం ఉంచి జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 2019 సీజన్‌లో విఫలమైనప్పటికీ తనను తుది జట్టు నుంచి తప్పించలేదని తెలిపాడు. తనపై అపారమైన నమ్మకం ఉంచిన ఫ్లెమింగ్‌,ధోనికి ధన్యవాదాలు తెలిపారు.