అర్జున్ రెడ్డి సినిమాలోని తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్న నటి షాలిని పాండే. విజయ్ దేవరకొండ సరసన నటించి సూపర్ టాక్ ను అందుకుని వరుస ఆఫర్లతో దూసుకుపోతూ ఇటు టాలీవుడ్ కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళంలో రెండు సినిమాలతో బిజీగా మారి ఇటు తెలుగులో చేతికందిన ఆపర్లను కూడా విడిచిపెట్టడం లేదు.
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నిర్మితమవుతున్న చిత్రంలో కూడా షాలిని పాండే ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఏకంగా సొంతంగా డబ్బింగ్ ను కూడా పరీక్షించుకోనుంది. ఇక అసలు విషయానికొస్తే దిల్ రాజు- అశ్వినీదత్ సంయుక్త నిర్మాతలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహష్ బాబు తన 25 సినిమాలో షాలిని పాండేకు అవకాశమిచ్చినట్లు సమాచారం.
ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఎంపిక చేసినప్పటికి ఓ ముఖ్యపాత్రకు షాలిని పాండేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించనుంది. ఈ సినిమా హిట్ అయితే షాలిని పాండేకు స్టార్ హీరోలతో అవకాశాలు కూడా రావాచ్చిన సిని వర్గాల గుసగుసలాడుతున్నారు.