సీరియస్ సినిమా కాదంటున్న హీరో

140
- Advertisement -

అల్లరి నరేష్ కామెడీ సినిమాలను పక్కన పెట్టి ఇకపై సీరియస్ సినిమాలే చేస్తున్నాడనేది అందరికీ తెలిసిందే. మహేష్ బాబు మహర్షి లో కూడా నరేష్ కామెడీ పాత్ర కాకుండా ఓ సీరియస్ పాత్ర పోషించాడు. ఇక ‘నాంది’ తర్వాత కంప్లీట్ గా నరేష్ సీరియస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడని అతని లైనప్ చూస్తే అర్థమవుతుంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కూడా ట్రైబల్ ఏరియాలో జరిగే ఎన్నికల కథతో సీరియస్ గా తెరకెక్కనుందని టీజర్. ట్రైలర్ చెప్పకనే చెప్తున్నాయి.

అయితే తన అప్ కమింగ్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజనీకం పూర్తి సీరియస్ సినిమా కాదని తాజాగా అల్లరి నరేష్ చెప్పుకున్నాడు. సినిమా అరవై శాతం సీరియస్ గా ఉంటుందని మిగతా అంతా కామెడీగానే ఉంటుందని అన్నాడు. సినిమాలో 40 % వినోదం ఉంటుందని అందరూ నవ్వుకునేలా ఆ సీన్స్ ఉంటాయని తెలిపాడు. తనతో పాటు వెన్నెల కిషోర్ , ప్రవీణ్ బాగా నవ్విస్తారని అంటున్నాడు. అయితే నరేష్ సినిమాలో కామెడీ ను హైలైట్ చేస్తూ చెప్పడానికి ఓ రీజన్ ఉంది.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం పూర్తి స్థాయి సీరియస్ సినిమా అంటే టికెట్లు తెగవని గమనించి ఇందులో ఉన్న కామెడీ గురించి బయట పెట్టాడు నరేష్. అన్ని కార్యక్రామాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 25 న రిలీజ్ కాబోతుంది. మరి నరేష్ కి ఈ సినిమా నాంది లా మంచి పేరు తెస్తుందా ? కమర్షియల్ గా కూడా హిట్ అనిపించుకుంటుందా ? చూడాలి.

ఇవి కూడా చదవండి…

విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ ట్రైలర్

ప్రేమలో కాంతార దర్శకుడు!

పవన్ వడ్డీ గోల.. మళ్లీ అవే గుసగుసలు !

- Advertisement -