NTR:యుగ పురుషుడు ఎన్టీఆర్

121
- Advertisement -

ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ ఉత్తరాదిలో మద్రాసీలుగా పేరుబడిన తెలుగువారికి ప్రత్యేక అస్ధిత్వాన్ని ఏర్పర్చిన మహానేత. ఇటు నటన.. అటు రాజకీయాలు రెండింటిలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్న లెజెండ్. ఇవాళ ఆయన 101వ జయంతి సందర్భంగా greattelangaana.com ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

తెలుగు సినీరంగాన్నిదశాబ్దాలపాటు ఏకచ్చత్రాధిపత్యంగా ఏలిన ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలకు జీవం పోసి.. అసలు దేవుడంటే ఇలాగే ఉంటాడేమో అనిపించారు. కేవలం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారం హస్తగతం చేసుకుని దేశ రాజకీయాల్లోనే చరిత్ర సృష్టించారు. .ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎందరో యువకులు రాజకీయ రంగ ప్రవేశం చేసి.. రాజకీయ దిగ్గజాలను మట్టికరిపించారు. బడుగు జీవుల సంక్షేమమే పరమావధిగా తపించిన ఎన్టీఆర్ ప్రజల వద్దకే పాలన ఉండేలా చర్యలు చేపట్టారు. పేదల కోసం కిలో బియ్యం రూ.2లకే, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఎన్టీఆర్‌ది.

Also Read:ట్యూటర్‌ ను పెట్టుకొని మరీ..

1923, మే 28 న ఏపీలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు ఎన్టీఆర్. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు. వీరికి 11 మంది సంతానం. ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ,లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.

ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేశారు. తర్వాత శ్రీరామ పట్టాభిషేకం,సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. క్రమశిక్షణకు మారుపేరు ఎన్టీఆర్. వృత్తిపట్ల ఆయన నిబద్దత ఎంతో మందికి ఆదర్శం. 1968లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. 1978లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు ‘కళాప్రపూర్ణ ‘ స్వీకరించారు.

Also Read:TTD:వైభవంగా వెంకటేశ్వరస్వామి వసంతోత్సవాలు

- Advertisement -