- Advertisement -
విశాలాంధ్ర మాజీ ఎడిటర్,సీనియర్ జర్నలిస్టు చక్రవర్తుల రాఘవాచారి(81) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృసి చేశారు రాఘవాచారి. విలువలు, నిబద్దతతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచి తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు.
దాదాపు మూడు దశాబ్దాల పాటు 1972 నుంచి 2005 వరకు విశాలాంధ్ర పత్రిక ఎడిటర్‌గా కొనసాగారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా సేవలందించారు.ఆయన మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్‌లు సంతాపం తెలిపారు.
- Advertisement -