బిగ్ బాస్3..ఫైనల్స్ కు మెగాస్టార్

486
chiranjeevi in Biggboss
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికి 14వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇంకో వారంతో ముగియనుంది. ప్రస్తుతం హౌజ్ లో 5గురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే బిగ్ బాస్ 3 టైటిల్ ను గెలవనున్నారు. ఇక నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈషోకు అద్భుతమైన స్పందన వస్తోంది. బిగ్ బాస్ 1,2 కంటే సీజన్ 3కి రేటింగ్ ఎక్కువగా వస్తుంది. శ్రీముఖి, బాబ భాస్కర్, వరుణ్, అలీ, రాహుల్ లో చివరి వారం హోజ్ లో ఉండనున్నారు. ఇక ఫైనల్ వీక్ కోసం చాలా కసరత్తులు చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు.

ఈసారి ఫైనల్ విజేత ను ప్రకటించిందేందకు మెగాస్టార్ చిరంజీవిని తీసుకురానున్నారట బిగ్ బాస్ యాజమాన్యం. ఇప్పటికే వారు చిరంజీవితో మాట్లాడారని అందుకు చిరు కూడా ఒకే చెప్పారని సమాచారం. కాగా నాగార్జున హోస్ట్ కావడంతో చిరు కూడా కాదనలేకపోయారట. ఇక బిగ్ బాస్ 3 విన్నర్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రకటించనున్నారు. బిగ్ బాస్ సీజన్ 2లో నాని వ్యాఖ్యతగా వ్యవహరించగా ఫైనల్ ఎపిసోడ్ కు విక్టరీ వెంకటేశ్ హాజరయ్యారు. ఈసారి మరింత స్పెషల్ గా మెగాస్టార్ రానున్నారు. మెగాస్టార్ చేతుల మీదుగా ఆ బిగ్ బాస్ ట్రోపిని ఎవరు అందుకుంటారో చూడాలి మరి.

- Advertisement -