సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు రూటు మార్చినట్టు వార్తుల వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గరుడవేగ’. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత మంచి హిట్ అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ సినిమా తర్వాత నుంచి రాజశేఖర్ కథల ఎంపికిలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన ‘అ!’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను జూన్, జులైలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సుందుట.
ఇక విషయానికొస్తే రాజశేఖర్ తను ఇప్పటి నుంచి విలన్ పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని ఆయన గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. స్రవంతి మూవీస్ బ్యానర్‌లో రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రాజశేఖర్ ఓ హిట్ కొట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రత్యేకమైన విలన్ పాత్ర కోసం రాజశేఖర్ ఎంపిక చేసుకునే ఛాన్సులున్నట్ట్లు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రాజశేఖర్ విలన్ పాత్రలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన విలన్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే వేచి
చూడాల్సిందే.