స‌చిన్ రాముడైతే.. నేను హ‌నుమంతుడిని…

211
Sehwag Says to Im Hanuman, Sachin Ram

ఇండియ‌న్ క్రికెట్‎లో లెజెండ‌రీ క్రికెట‌ర్లు స‌చిన్ టెండూల్క‌ర్, వీరేంద్ర సెహ్వాగ్. వీళ్లిద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌నుకుంటా… మైదానంలో ఎలా ఉండేవారో.. ఆటకు ముగింపు ప‌లికిన త‌ర్వాత కూడా దృఢ‌మైన బంధాన్ని కొన‌సాగిస్తున్నారు. ఇక ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‎గా ఉండి త‌నదైన శైలిలో నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తుంటాడు సెహ్వాగ్ .

Sachin  And Sehwag

ఈ సారి టీ తాగుతూ స‌చిన్‎తో దిగిన ఫోటోను సెహ్వాగ్ ఇంస్ట్రాగ్రామ్‎లో పోస్ట్ చేశాడు. ఇందులో నిలబ‌డి ఉన్న స‌చిన్ ముందు సెహ్వాగ్ హ‌నుమంతుడిలా కూర్చుని ఉన్నాడు. స‌చిన్ రాముడు అవుతే.. నేను హ‌నుమంతుడిని, దేవుడితో ఉన్నప్పుడు.. అతడి పాదాల వద్ద ఉండటం బాగుంది’ అని క్యాప్ష‌న్ కూడా పెట్టాడు.

ఇప్పుడు ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‎గా మారింది. స‌చిన్‎తో సెహ్వాగ్ ఎంత విన‌మ్ర‌త‌తో ఉంటాడో ఈ ఫోటో చూస్తే తెలుస్తోంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి కొంద‌రైతే హ‌నుమంతుడిగా సెహ్వాగ్ బ‌లే ఉన్నాడ‌ని, ఎప్ప‌టికీ వీరిద్ద‌రి అనుబంధం ఇలాగే ఉండాల‌ని కామెంట్లు పెడుతున్నారు. అప్ప‌ట్లో ఓపెన‌ర్లుగా దిగి.. బౌల‌ర్ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించి.. మైదానంలో ప‌రుగుల వ‌ర‌ద కురిపించిన విష‌యం తెలిసిందే. మొత్తం 93 వన్డేల్లో వీరిద్దరు ఓపెనర్లుగా దిగి 42.13 సగటుతో 3,919 పరుగులు సాధించి ఎన్నో విజ‌యాలు అందించారు.

https://www.instagram.com/accounts/login/?next=%2Fp%2FBjyl1agBvI0%2F&source=follow