ఎంబీఏ స్టూడెంట్ గా మహేశ్ బాబు?

304
srimanthudu in mahesh babu

భ‌ర‌త్ అనే నేను సినిమాతో భారీ స‌క్సెస్ ను సాధించాడు ప్రిన్స్ మ‌హేశ్ బాబు. ఈ స‌క్సెస్ ను ఫారిన్ లో త‌న కుటుంబ స‌భ్యుల‌తో ఎంజాయ్ చేసి ఇటివ‌లే హైద‌రాబాద్ చేరుకున్నారు. మ‌హేశ్ త‌ర్వాతి సినిమా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. మ‌హేశ్ బాబు కెరీర్ లో ఇదిఇ 25వ సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి.

maheshbabu new look

ఈనెల 17వ తేదినుంచి ఈ చిత్రం రెగ్యూల‌ర్ షూటింగ్ జ‌రుప‌నున్న‌ట్లు తెలిపారు చిత్ర యూనిట్. డెహ్రాడూన్ లో మొద‌టి షెడ్యూల్ తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ చిత్రంలో మ‌హేశ్ ఏ పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. రీసెంట్ గా మ‌హేశ్ బాబు కొత్త లుక్ లో ద‌ర్శ‌మిచ్చాడు. ఫ్యామిలితో టూర్ ముగించుకుని వ‌స్తుండ‌గా ఆయ‌న గ‌డ్డంతో ఉన్న ఫోటోలు ట్విట్ట‌ర్ పోస్ట్ చేశారు ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరొద్క‌ర్.

vamshi paidipalli, mahesh babuమ‌హేశ్ కొత్త గెట‌ప్ త‌న త‌ర్వాతి సినిమాకోస‌మే అని అంద‌రూ అనుకున్నారు. ఎలాంటి పాత్ర చేస్తోడ‌నే విష‌యంపై అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హేశ్ ఎంబీఏ స్టూడెంట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇక మ‌హేశ్ బాబు గ‌తంలో స్టూడెంట్ గా శ్రీమంతుడు సినిమా చేసిన విష‌యం తెలిసిందే. ఆ సినిమా భారీ విజ‌య‌న్ని అందుకుంది. వంశీ పైడిప‌ల్లి తో తీయ‌బోయే సినిమా ఎంత వ‌ర‌కూ స‌క్సెస్ అవుతుందో చూడాలి. మ‌హేశ్ బాబు జోడిగా పూజా హెగ్దె హీరోయిన్ గా న‌టించ‌నుంది. ఈసినిమాను ప్ర‌ముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వీని ద‌త్ లు సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈసినిమానే విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌న్నారు చిత్రబృందం.