‘మహర్షి’ మూవీ నుంచి సెకండ్ సాంగ్..

639
Maharshi New Look
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు 25వ చిత్రంగా మహర్షి సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా..అల్లరి నరేష్ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. దిల్ రాజు, అశ్వీనిదత్, పీవీపీలు సంయుక్తంగా ఈసినిమాను తెరకెక్కించారు. ఇటివలే ఈసినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈమూవీ నుంచి సెకండ్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. “నువ్వే సమస్తం .. నువ్వే సిద్ధాంతం .. నువ్వే నీ పంతం .. నువ్వేలే అనంతం .. ప్రతి నిశి మసై ” అంటూ ఈపాట సాగింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈసినిమాకు దేవి మ్యూజిక్ హైలెట్ గా నిలువనుందని తెలుస్తుంది. మహర్షి మూవీలోని సెకండ్ సాంగ్ మీకోసం…

https://youtu.be/qa_QF141NwM

 

- Advertisement -