మహేశ్ బాబుతో మరోసారి..ఆ దర్శకుడికి బంపర్ ఆఫర్

390
Superstar Mahesh Babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈమూవీలో రష్మీక మందన హీరోయిన్ గా నటించిది. ఈమూవీలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రకాశ్ రాజ్, విజయశాంతి ముఖ్య పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రంలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 

కాగా ఈసినిమా తర్వాత మహేశ్ ఎవరితో చేస్తాడా ఆసక్తి నెలకొంది. కేజీఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటివలే మహేశ్ కు కథ వినిపించాడట. అయితే ఈమూవీ ఇంకా కన్ఫామ్ కాలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన తర్వాతి చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు మహేశ్. తనకు మహర్షి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయనన్నట్లు తెలిపాడు. ఒక రెండు నెలల గ్యాప్ తర్వాత ఆ సినిమా ప్రారంభం కానున్నట్లు చెప్పాడు. ఇక సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా మరో సినిమా చేయనున్నట్లు తెలిపాడు.