నిర్మాతగా మారిన ప్రముఖ సంగీత దర్శకుడు

247
Ar Raheman
- Advertisement -

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్. రెహమాన్ నిర్మాతగా మారారు. ఆయన నిర్మాత అయ్యారంటే ఆ సినిమా కథ ఎలా వుంటుందో ముందే ఊహించవచ్చు. సంగీత ప్రధానంగా సాగే సినిమా కథ ఇది. ఈ సినిమాకు ’99 సాంగ్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గాయకుడిగా రాణించడానికి ఓ యువకుడు చేసిన ప్రయత్నాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని తెలుస్తుంది.

ఈ సినిమా కథను కూడా ఆయనే రాయడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఈచిత్రానికి విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈవిషయాన్ని ట్వీట్టర్ ద్వారా తెలిపారు ఏఆర్.రెహమాన్. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ ఏడాది జూన్ 21వ తేదీన ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

సంగీతమే ప్రధానంగా సాగే ఈ సినిమాలో మనీషా కొయిరాలా, లీసారే, ఎహాన్ భాట్, ఎడిల్సి వెరగాస్, థామస్ ఆండ్ర్యూస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇన్ని రోజులుగా మీ అందరి ప్రేమ, మద్దతు, ప్రోత్సాహం నాపై చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.

 

- Advertisement -