‘మహర్షి’కి దక్కిన మరో అరుదైన ఘనత..

425
mahesh

మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మహర్షి’.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, సి. అశ్వనిదత్, ప్రసాద్ వీ. పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరించారు. మే 9, 2019న విడుదలయైన ఈ సినిమా రూ. 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. బాక్సాఫీస్ వద్ద 170 కోట్ల రూపాయలను వసూల్ చేసింది.

maharshi

అయితే తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనతను సోంతం చేసుకుంది. ఈ మూవీ 2019 సంవ‌త్సరానికి గాను ట్విట్ట‌ర్‌లో అత్యంత ప్ర‌భావితం చేసే అంశాల‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేసింది.

ఈ చిత్రంలో రైతు సమస్యలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. అన్నదాత దుస్థితిని అర్థవంతమైన సన్నివేశాలు, సంభాషణలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఊరి మేలు కోసం రిషి ఎంతవరకు పోరాటం చేశాడనే అంశాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించారు దర్శకుడు వంశీ పైడిపల్లి.