అన్యాయంపై విజయం..రైతులకు అభినందనలు: రాహుల్

110
rahul
- Advertisement -

కొత్తగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దూ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశ రైతులు త‌మ స‌త్యాగ్ర‌హ దీక్ష‌తో.. కేంద్ర స‌ర్కార్ అహంకారాన్ని త‌ల‌దించుకునేలా చేశార‌న్నారు.

ఇది అన్యాయంపై విజ‌య‌మ‌ని, ఈ సంద‌ర్భ‌రంగా రైతుల‌కు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. జై హింద్‌, జై కిసాన్ అంటూ అని పేర్కొన్నారు. రైతు చ‌ట్టాల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకునేలా చేస్తామ‌ని రాహుల్ గతంలో తాను చేసిన ప్రసంగం వీడియోని షేర్ చేశారు.

ఏడాది కాలం నుంచి దేశ‌వ్యాప్తంగా రైతులు కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఆ ఆందోళ‌న‌ల్లో వంద‌ల సంఖ్య‌లో అన్న‌దాత‌లు ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -