జనవరి 12నే పవన్… భీమ్లా నాయక్‌

160
pawan
- Advertisement -

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా రానా ప్రధాన పాత్రలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. మలయాళ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా రిలీడ్ డేట్ కన్ఫామ్ కాగా తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. 2022, జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన సినిమా సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ సాంగ్ 20 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ మల్టీస్టారర్‌లో నిత్యా మీనన్, సంయుక్త మీన హీరోయిన్స్. థమన్ సంగీత దర్శకుడు.

- Advertisement -