ఎలక్షన్ రిపోర్ట్ ; ఇక్కడ సత్తా చాటేదెవరు?

28
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో ఓ రెండు నియోజక వర్గాలపై అందరి దృష్టి నెలకొంది. ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఎప్పటికప్పుడు బిన్నంగా తీర్పునిస్తూ వస్తున్నారు. ఆ నియోజక వర్గాలు ఏవంటే సత్తుపల్లి మరియు పెద్దపల్లి. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా గెలుపు ఎప్పటికప్పుడు చేతులు మారుతూ వచ్చింది. సత్తుపల్లి నియోజిక వర్గంలో ఇప్పటివరకు టీడీపీ ఆరు సార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు విజయం సాధిస్తూ వచ్చాయి. గతంలో ఈ నియోజిక వర్గంలో కాంగ్రెస్ నుంచి జలగం కుటుంబం మరియు టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరావు మద్య హోరాహోరీ పోరు నడుస్తూ వచ్చింది. ఇక 2009 నుంచి 2018 వరకు మరిగిన మూడు ఎన్నికల్లో టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య గెలుపొందుతూ వచ్చారు. ఈసారి ఆయన బి‌ఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. .

ఇక ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తే అభ్యర్థులు ఎవరనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కాగా నియోజిక వర్గంలో సండ్ర వెంకటవీరయ్యకు మంచి ప్రజాధరణ ఉండడంతో పాటు కే‌సి‌ఆర్ పాలన పట్ల ప్రజా సానుకూలత ఈసారి నియోజిక వర్గంలో బి‌ఆర్‌ఎస్ విజయం ఖాయంగా తెలుస్తోంది. ఇక పెద్దపల్లి విషయానికొస్తే ఇక్కడ 1952 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ఐదు సార్లు, టీడీపీ నాలుగు సార్లు, బీజేపీ, పీడీఎఫ్, స్వతంత్రులు ఒక్కో ఆశ్రి విజయాన్నినమోదు చేశారు. 2014 మరియు 2018 ఎన్నికల్లో వరుసగా బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి మనోహర రెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు. ఈసారి కూడా బి‌ఆర్‌ఎస్ నుంచి ఆయనే పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఈసారి విజయ రమణ బరిలో దిగబోతున్నారు. బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. ప్రస్తుతం నియోజిక వర్గ సర్వేల ప్రకారం మరోసారి బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి మనోహరరెడ్డి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:హెచ్‌సీఏ ఎన్నికలు..సర్వం సిద్ధం

- Advertisement -