శిఖర్ ధావన్ స్ధానంలో సంజూ శాంసన్

364
Sanju Samson
- Advertisement -

డిసెంబర్ 6 నుంచి వెస్టిండిస్ తో టీ20మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌ టూర్‌కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తప్పించారు సెలక్టర్లు. గాయం కారణంగా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను వెస్టిండిస్ టూర్ నుంచి తప్పించినట్లు తెలిపారు సెలక్టర్లు. అతని స్ధానంలో వికెట్ కీపర్‌, బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. అతను కోలుకొవడానికి మరో నెల రోజులు సమయం పట్టనుంది. దీంతో సంజూ శామ్సన్ ను సెలక్ట్ చేశారు.

ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు భారత జట్టులోకి ఎంపికైనా ప్లేయింగ్ లెవన్‌లో సంజూకు చోటు దక్కలేదు. వరుసగా విఫలమవుతున్నా రిషభ్ పంత్‌కు అవకాశాలివ్వడంపై టీమ్ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. సంజు శాంసన్‌ను బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ 20 సిరీస్ కోసం చోటు సంపాదించాడు.. భారత్ 2-1 తేడాతో ఈ సిరీస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ.. సంజుకు తుది జట్టులో స్థానం దక్కలేదు డిసెంబర్ 6 నుంచి ఈ మూడు టీ20ల సిరీస్ మొదలవుతుండగా.. హైదరాబాద్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది.

sanju samson might replace shikhar dhawan for series against west indies

- Advertisement -