సామ్ కొబ్బరికాయ కష్టాలు.. వీడియో..

277
Samantha
- Advertisement -

అక్కినేని నాగచైతన్య-ఆయన భార్య సమంత కలిసి నటిస్తున్న సినిమా నిన్న పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మామ నాగార్జున కూడా హాజరయ్యారు. ఈ పూజా కార్యక్రమంలో సమంత కొబ్బరి కాయ కొట్టడానికి ప్రయత్నించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొబ్బరి కాయ కొట్టమని పూజారి సమంతకు ఇవ్వగా.. కొబ్బరికాయ పగలకొట్టడానికి విఫల ప్రయత్నం చేసింది. అయినా పగులగొట్టలేక పోయింది సామ్.

samantha-chaithu

ఇక అలసిపోయి నా వలన కాదు అన్నట్లుగా పూజారికి ఇచ్చేసింది. ఈ వీడియోని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సమంత కూడా స్పందించింది. తాను సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొనకపోవడానికి ఇదీ ఒక కారణం అంటూ సమంత సరదా కామెంట్ చేసింది. అయితే జిమ్ లో భారీ మొత్తంలో బరువులు లేపి అభిమానులతో పంచుకునే సమంత.. కొబ్బరి కాయ కొట్టకపోవడం ఏంటని ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఆమె కొబ్బరి కాయ పగులకొట్టడానికి ప్రయత్నించి అలసిపోయి.. పూజారికి అమాయకంగా ఇస్తున్న వైనం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక పెళ్లి తరువాత చైతూతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానులలో ఆసక్తి పెరిగింది. మరోసారి ఈ ఇద్దరు కలిసి ఏ మాయ చేశావో సినిమా మాయ చేస్తారో లేదో చూడాలి ఇక.

- Advertisement -