రీడ్‌వేర్‌కి గూగుల్ గుర్తింపు…

321
readwhere
- Advertisement -

తెలుగులో వెబ్ సైట్‌ లేదా బ్లాగ్‌ను రన్‌ చేస్తున్న వారికి గూగుల్ శుభవార్తను తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఇంగ్లీష్‌తో పాటు కొన్ని భాషలకే పరిమితమైన గూగుల్ యాడ్‌ సెన్స్‌ సపోర్ట్‌ను తెలుగు వెబ్‌ సైట్లకు కూడా అందించింది. గూగుల్ తెచ్చిన ఈ సదుపాయంతో సీఎంఎస్ అకౌంట్ ఉన్న తెలుగు వెబ్ సైట్స్ కూడా ఆదాయాన్ని పొందవచ్చు.

ఈ నేపథ్యంలో తెలుగులో గూగుల్ సీఏమ్ఎస్ అకౌంట్ గుర్తింపు  పొందిన సంస్థగా మిడియాలజీ సాఫ్ట్ వేర్ కంపెనీ నిలిచింది. రీడ్ వేర్ ద్వారా ఈ కంపెనీ డైలీ పేపర్స్,మ్యాగజైన్స్,ఆన్ లైన్ వెబ్ సైట్స్‌,కామిక్స్‌కు సీఎంఎస్‌ అకౌంట్‌ని అందిస్తోంది.

ఆండ్రాయిడ్,ఐఓఎస్ ఫ్లాట్ ఫామ్‌లో యూజర్ ఫ్రెండ్లీ యాప్స్‌ను తాము అందిస్తున్నామని…గూగుల్ గుర్తించిన తొలి సంస్థగా నిలవడం గర్వకారణంగా ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

- Advertisement -