పవర్‌స్టార్‌కు నో చెప్పిన సామ్‌..!

117
sam

అక్కినేని వారి కొడలు సమంత ఈమధ్య సినిమాలు తగ్గినట్లు అనిపిస్తోంది. చివరిగా ఒ బేబిలో నటించిన సామ్‌ ఇప్పటివరకు వేరే ఏ సినిమా అంగీకరించలేదు. సామ్‌ తన కథల ఎంపికలో.. సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహిస్తోంది. సమంతాకు క్రేజీ ఆఫర్లు వస్తున్నప్పటికీ అన్నిటిని ఒప్పుకోవడంలేదు. ఇటీవల ఓ బాలీవుడ్ ఆఫర్‌ను కూడా సమంత తిరస్కరించడం సినీ వర్గాలలో ఒక హాట్ టాపిక్ అయింది.

u turn

ఇంతకుముందు సామ్‌ యూ టర్న్‌ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగు, తమిళం రీమేక్‌లో సమంత కోరి మరీ నటించింది. కాగా అదే చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్‌ కానుంది. ఇందులో సమంతకు నటించే అవకాశం వచ్చిందట. అయితే ఆ అవకాశాన్ని ఈ బ్యూటీ నిరాకరించినట్లు సమాచారం. అలా బాలీవుడ్‌ ఎంట్రీని కాదన్న సమంత గురించి ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ఇండస్ట్రీగా మారింది.

pink

అలాగే బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ ను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారు. హిందీ వెర్షన్‌లో తాప్సీ పోషించిన పాత్ర కోసం మొదట సమంతానే సంప్రదించారట. అయితే సమంత ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట. అయితే ఈ ఆఫర్స్‌ను తీరస్కరించడానికి అసలు కారణం తెలియాల్సివుంది. కాగా సమంత ప్రస్తుతం ’96’ రీమేక్ లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే నెట్ ఫ్లిక్స్ ఫిలింలో నటిస్తోంది.

Janasena Party President cum actor Pawan Kalyan is all set to make his comeback on the silver screen with the remake of the cult hit film Pink.