తెలుగు కథానాయికలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకుంది సమంత. ప్రస్తుతం ఆమె నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహానటి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో సమంత జర్నలిస్ట్ మధురవాణిగా కనిపించనున్నారు. అయితే రంగస్థలం సినిమాతో విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకున్నారు. రంగస్థలంలో రామలక్ష్మి పాత్రకి వాయిస్ మాత్రం తను చెప్పలేదు.

కానీ మహానటిలో మాత్రం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. డబ్బింగ్ చెప్పతున్న ఒక ఫోటోను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో సగం బన్నుని ఎడమ చేతితో పట్టుకుని, స్టూడియోలో కూర్చుని సమంత డబ్బింగ్ చెబుతున్నట్లు అందులో ఉంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహానటి మూవీ మే 9న విడుదలకు సిద్దమవుతోంది.
మరోవైపు ఈ చిత్రంలో మహానటిగా నటిస్తున్న కీర్తి సురేష్ కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. మహానటి టీజర్ ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
— Samantha (@Samanthaprabhu2) April 18, 2018

