మాది తొలిచూపులోనే కలిగిన ప్రేమ-సమంత..

239
Samantha

తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా వెలుగొందుతున్నారు అక్కినేని వారి కోడలు సమంత. సామ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. అభిమానుల కామెంట్ల, పోస్టులకు వెంటనే రిప్లై ఇస్తుంటారు. తాజాగా ఓ యువకుడు పోస్టు చేసిన పోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని సమంత పెళ్లి ఫోటోను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ లో పోస్టు చేశాడు. అందులో సామ్ పక్కన నాగచైతన్యకు బదులు మరో యువకుడు పెళ్లి గెటప్ లో ఉన్న పిక్ ని సెట్ చేశారు.

Samantha

ఓ అభిమాని పోస్టు చేస్తూ.. సమంత ఏంటిది అంటూ కామెంట్ చేశాడు. ఈ పిక్ పై సామ్ సరాదాగా స్పందించారు. అవును మేం గతవారం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. ఈ ఫోటో ఎలా లీక్ అయ్యిందో తెలియదు. మాది తొలిచూపులోనే కలిగిన ప్రేమ అంటూ ట్వీట్ చేశారు. సమంత కామెంట్ పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నీ కామెంట్ కి నవ్వు ఆపుకోలేక పోతున్నామని, నాగచైతన్యను మోసం చేస్తావా..?, హో మై గాడ్ అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.

సమంత ప్రస్తుతం యూ టర్న్ సినిమాలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. సప్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారు. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.