డూప్లెక్స్ ఇల్లు కొన్న స‌మంత

80
- Advertisement -

టాలీవుడ్ అగ్ర న‌టి స‌మంత తాజాగా ఒక డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని నాన‌క్‌రామ్‌గూడ‌లో జ‌య‌భేరి ఆరెంజ్ కౌంటీలోని ఈ భ‌వంతిని న‌ల్లా ప్రీత‌మ్ రెడ్డి నుంచి రూ.7.8 కోట్ల‌కు స‌మంత కొనుకుందంటా. ఓపెన్ ప్లేస్ పోను 7,944 ఎస్ఎఫ్‌టీ విస్తీర్ణంలో ఈ భ‌వ‌నాన్ని నిర్మించారు. ఇందులో ఆరు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు నాగ చైతన్య తన కస్టడీ మూవీ ప్రమోషన్‌లో భాగంగా సమంత పై ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నాడు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా చైతన్య, సమంత పై క్రేజీ కామెంట్స్ చేశాడు. ‘మీ కో యాక్టర్స్‌లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి ? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. సమాధానంగా చైతూ.. పూజా హెగ్డేలో స్టైల్, సమంతలో హార్డ్ వర్కింగ్, కృతి శెట్టిలో ఇన్నోసెన్స్ నచ్చుతుందని చైతు సమాధానంగా చెప్పాడు. అయితే, సమంత గురించి చెబుతున్నప్పుడు చైతు కళ్ళల్లో తెలియని స్పార్క్ కనిపించింది. పైగా చైతు మాటలను బట్టి, సమంత పై అతనికి ఇంకా ఎక్కడో పాజిటివ్ ఫీలింగ్ ఉందని అర్ధం అవుతుంది.

Also Read:హ్యాపీ బర్త్ డే…సాయి పల్లవి

అన్నట్టు.. సమంతనే తాను ఫస్ట్ కిస్ చేశా అని నాగ చైతన్య చెప్పడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ‘ఏ మాయ చేసావే’ సినిమాలోనే తాను ఫస్ట్‌ టైమ్‌ ఆన్‌స్క్రీన్‌ కిస్‌ సీన్‌లో నటించాను అని, అది కూడా సమంతనే కిస్ చేశాను అని, ఆ సమయంలో సమంత తనకు చాలా బాగా సపోర్ట్ చేసింది అని చైతు చెప్పుకొచ్చాడు. మొత్తానికి సమంత డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుక్కుని వేరు అయిపోయినా, చైతు మాత్రం ఆమె పై పాజిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు.

Also Read:హ్యాపీ బర్త్ డే..రౌడీ బాయ్ విజయ్

- Advertisement -