ఫస్ట్ బర్త్‎డే …స్వర్గంలోకి వెళ్లానంటున్న సామ్..

239
Samantha Akkineni After Marriage First Birthday photos
- Advertisement -

టాలీవుడులో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పర్చుకుని టాప్ హీరోయిన్‎లలో ఒకరిగా కొనసాగుతుంది సమంత. 2010లో ఏం మాయ చేశావే చిత్రంతో టాలీవుడులోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడుకి ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. అలా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. యంగ్ హీరో నాగచైతన్యని ప్రేమ పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలిగా అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో సామ్ బిజీగా ఉంది.

Samantha Akkineni After Marriage First Birthday photos

తాజాగా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‎కి జంటగా రామలక్ష్మి పాత్రలో అద్భుత నటనతో విమర్శుకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. తొలిసారి పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నేడు సమంత బర్త్ డే సంబర్భంగా భర్త నాగచైతన్యతో కలిసి హిమాలయాలకి వెళ్లింది. అక్కడి అందమైన ప్రదేశాలను తిలకిస్తూ… హోటల్ గదిలో నుంచి తీసిన ఫోటోని శ్యామ్ తన ఇన్ స్టాగ్రామ్‎లో షేర్ చేస్తూ స్వర్గంలో
అడుగుపెడుతున్నానంటూ కామెంట్ పెట్టింది.

అయితే అంతకు ముందు యూటర్న్ చిత్ర యూనిట్‎తో కలిసి బర్త్‎డే వేడుక చేసుకుంది. ఆ ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక పెళ్లి తర్వాత తన మొదటి బర్త్‎డే కావున ఈ రోజుని చాలా స్పెషల్‎గా భావిస్తుంది. సామ్ నటించిన మహానటి చిత్రం మే9న విడుదల కానుండగా, తమిళంలో ఇరుంబు థిరై అనే పేరుతో ఈ చిత్రాన్ని 11న రిలీజ్ చేయనున్నారు.

- Advertisement -