అక్కినేని అభిమానులకు సమంత షాక్‌.. వైర‌ల్‌

37

స‌మంత అక్కినేని సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.. ట్విట్ట‌ర్‌లో ఆమెకు 8.9 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. త‌న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ప్ర‌తిరోజు అభిమానుల‌ను అల‌రిస్తోంది. అయితే ఇప్పుడు సామ్‌ చేసిన ఒక ప‌ని అంద‌రినీ షాక్‌కు గురిచేస్తుంది. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో త‌న పేరు త‌ర్వాత ఉన్న అక్కినేని ఇంటి పేరును తొల‌గించింది.

ఇంత‌కు ముందు వ‌ర‌కు ట్విట్ట‌ర్‌లో ఆమె ఇంటి పేరు స‌మంత అక్కినేనిగా ఉండేది.. ఇప్పుడు మాత్రం కేవ‌లం ఎస్ అనే అక్ష‌రాన్నే ఉంచుకుని మిగ‌తాదంతా తీసేసింది. దీంతో ఎందుకు అలా చేశావు స‌మంత? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కొంద‌రు స‌మంతకు ఆమె భ‌ర్త‌ నాగ చైతన్యతో గొడ‌వ‌లు వ‌చ్చాయా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక సమంత అభిమానులు మాత్రం దీనిపై మ‌రోలా వాదిస్తున్నారు. ఆమె తాజాగా న‌టిస్తున్న శాకుంతలం సినిమా పేరుతో ఎస్ అనే అక్ష‌రం పెట్టి ఉండొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాకుండా స‌మంత‌ త‌న ఇష్టప్ర‌కారం పేరు మార్చుకుంటే మీకొచ్చిన స‌మ‌స్య ఏంటి? ఈ విష‌యాన్ని అంత పెద్ద‌ది చేసి భూత‌ద్దంలో చూడాలా అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి సోష‌ల్ మీడియాలో పేరు మార్పు వెనుక కార‌ణ‌మేంటో స‌మంత‌నే చెప్పే దాకా ఈ చ‌ర్చ ఆగేలా లేదు మ‌రి.