కరోనా వైరస్ నియంత్రణ కొసం లాక్ డౌన్ లో భాగంగా ఇంటికే పరిమితం అయిన మన అందరికి కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న విద్యుత్ సిబ్బందికి కార్మికులకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.
మన అందరం ఇంటికే పరిమితం అయిన ఈ సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా 24గంటల విద్యుత్ ను మనకు సరఫరా చేస్తున్నారు ఒక వేళ వారు విధులకు హాజరు కాకుండా ఉండి మనకు ఇంటిలో విద్యుత్ లేకుండా ఉంటే మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి.
అదేవిదంగా గ్రామీణ ప్రాంతాల్లో పంటలు చివరి దశలో ఉన్నాయి ఈ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోతే నీరు అందక పంటలు ఎండిపోయి రైతులకు ఊహించని రీతిలో నష్టం జరిగేది. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి విధులు నిర్వహిస్తున్న పోలీసులు, డాక్టర్లు,పారిశుద్ధ్య కార్మికులతో, పాటు కనిపించకుండా తమ విధులను నిర్వహిస్తూన్న విద్యుత్ కార్మికులను కూడ మనం అభినందనలు తెలియజేయాలి.
ఇంత వేసవి కాలంలో కూడా ఒక్క సారి కూడ విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నాము అంటే మన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపుతో చేసిన ప్రణాళికల వల్లనే ఇది సాధ్యం అవుతుంది.
Just can’t imagine how our life would be under these circumstances without Electricity.
Salutes to our power generation and distribution teams who are on their toes to supply uninterrupted power to households in Telangana.
Kudos to our visionary CM #KCR sir.#UnsungHeroes pic.twitter.com/F0f5j8YpJ3
— Santosh Kumar J (@MPsantoshtrs) March 29, 2020