తెలంగాణ యువ‌కుడితో మాట్లాడిన మోదీ

64
Prime Minister Narendra Modi breaks silence, strongly condemns ...

మ‌న్ కి బాత్ కార్య‌క్ర‌మంలో భాగంగా తెలంగాణ‌కు చెందిన తొలి క‌రోనా బాధితుడితో మాట్లాడారు ప్ర‌ధాన మంత్రి మోదీ.అయితే ఇప్ప‌టికే ఆ యువ‌కుడు క‌రోనా నుంచి కొలుకున్నాడు. రాష్ట్రంలో క‌రోనా నివారణ కోసం తీసుకుంటున్న చర్యల పై అడిగి తెలుసుకున్నారు. దీంతో కరోనా ను జయించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు యువకుడు. హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు మోదీకి తెలిపాడు యువ‌కుడు.

ఈసంద‌ర్భంగా ఆ యువ‌కుడు మాట్లాడుతూ…క‌రోనా రాగానే మొద‌ట్లో చాలా భ‌య‌ప‌డ్డాను. మొదటి రెండు రోజులు ఆస్పత్రిలో టెన్షన్ పడ్డాను.. ఆత‌ర్వాత డాక్ట‌ర్లు, వైద్య‌ భ‌ర‌సిబ్బంది నాలో భ‌రోసా నింపిన‌ట్లు తెలిపాడు.డిశ్చార్జి అనంత‌రం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపాడు. యువకుడి అనుభవాల పై సెల్ఫీ వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారుల‌ను కోరారు ప్ర‌ధాని మోదీ.