నటనకు దూరంగా.. పెళ్ళికి దగ్గరగా !

145
- Advertisement -

సాయి పల్లవి ఫ్యాన్స్ కు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్. తన నటనతో ఎంతగానో అలరించే సాయి పల్లవి, వచ్చే ఏడాది నుంచి సినిమాలకి కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం సాయి పల్లవి సినిమాల ఎకౌంట్ కూడా ఖాళీగానే కనిపిస్తోంది. వరుస ఆఫర్లు వస్తున్నా.. వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేస్తోంది ఈ హోమ్లీ బ్యూటీ. తన పర్సనల్ లైఫ్ ను సినీ ప్రపంచం పూర్తిగా హ్యాక్ చేయకముందే.. సినిమాలకు కొంత కాలం లాగ్ అవుట్ చేయాలనేది సాయి పల్లవి అభిప్రాయం.

మరోవైపు ఈ మధ్య తన గ్లామర్ డోస్ పెంచింది సాయి పల్లవి. మొన్నటివరకు సంప్రదాయబద్దంగా కనిపించిన సాయి పల్లవి.. కొన్ని హాట్ ఫొటోల్లో కనిపించి షాక్ ఇచ్చింది. ఓ తమిళ సినిమా కోసం ఆ కాస్టూమ్స్ వేసుకోవాల్సి వచ్చిందని ఆ తర్వాత సాయి పల్లవి వివరణ ఇచ్చింది. ఈ లోపే సాయి పల్లవికు భారీగా ఆఫర్స్ పెరిగాయి. కమర్షియల్ హీరోయిన్ గా ఆమెను వాడుకోవాలని మేకర్స్ పోటీ పడ్డారు.

కానీ, సాయి పల్లవి మాత్రం ఏ సినిమాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అంతా బాగుందనుకున్న టైమ్ లోనే కెరీర్ నుంచి తప్పుకుంటే మర్యాద ఉంటుంది అనేది ఆమె వాదన. పైగా జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యం అంటుంది. తన కుటుంబం మొత్తం తన పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని కూడా చెబుతుంది. ఈ మాటలను బట్టి.. సాయి పల్లవి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం.

ఇవి కూడా చదవండి…

నగ్నంగా చిరంజీవి హీరోయిన్ !

‘హిట్2’ కి అసలు పరీక్ష

విడుదలకు ముందే రికార్డు… హనుమాన్‌

- Advertisement -