‘హిట్2’ కి అసలు పరీక్ష

137
- Advertisement -

నాని సమర్పణలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘హిట్ 2’ ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా క్లిక్ అవ్వడంతో తొలి రోజు మంచి కలెక్షన్స్ అందుకుంది వీకెండ్ చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి. ఓవర్ సీస్ లో కూడా మంచి నంబర్స్ తెచ్చుకుంది. అయితే ప్రతీ సినిమాకి ఉండే సోమవారం గండం హిట్ 2 దాతుతుందా ? అనే డౌట్ ట్రేడ్ పండిట్స్ లో కలుగుతుంది.

ప్రస్తుతం ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో థియేటర్స్ కి రావడం లేదు. టాక్ ఎంత బాగున్నా కేవలం మూడు రోజులే ప్రేక్షకులు థియేటర్స్ లో కనిపిస్తున్న పరిస్థితి. పైగా ఓటీటీ లో చూద్దాంలే అనుకునే ప్రేక్షకులు ఎక్కువైపోతున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్ , సమంత యశోద సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని మూడు రోజులకే డ్రాప్ అయ్యాయి. రిలీజ్ తర్వాత మూడు రోజులు మాత్రమే ఆ సినిమాల కలెక్షన్స్ లో జోరు కనిపించింది. ఆ రెండు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమా లవ్ టుడే కూడా సోమవారండ్రాప్ అయ్యింది. యూత్ ఆడియన్స్ తో మూడు రోజులు మంచి వసూళ్ళు రాబట్టిన లవ్ టుడే కి మండే నుండి కలెక్షన్స్ తగ్గాయి. మసూద ఒక్కటే సోమవారం నుండి కలెక్షన్స్ పెంచుకుంది మిగతా సినిమాలన్నీ సోమవారం దాటాక చల్లబడ్డాయి.

మరి ఈ లెక్కన చూస్తే అడివి శేష్ హిట్2 కి సోమవారం తర్వాత కూడా ఆశించిన కలెక్షన్స్ వస్తాయా ? లేదా సినిమా నేటి నుండి డ్రాప్ అవుతుందా ? ఇవ్వాళ సెకండ్ షో కల్లా తెలియనుంది. ప్రస్తుతానికి సోమవారం మార్నింగ్ షో బుకింగ్స్ మాత్రం స్లోగానే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ షో , సెకండ్ షో 50 పర్సెంటేజ్ అక్యూపెన్సీ వచ్చినా సినిమా నిలబడినట్టే. చూడాలి హిట్ అనిపించుకున్న హిట్ 2 సోమవారం గండాన్ని దాటేసి ఇంకా పెద్ద హిట్ అవుతుందా ?

ఇవి కూడా చదవండి…

టికెట్ టు ఫినాలే విజేత..శ్రీహాన్

అందరి కళ్ళు వీరయ్య మీదే

- Advertisement -