ప్రేమమ్ మూవీతో యూత్‌ని అట్రాక్ట్ చేసిన భామ సాయి పల్లవి. మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి భానుమతి సింగిల్ పీస్ అంటూ ప్రేక్షకులను ఫుల్ ‘ఫిదా’ చేసేసింది. ‘ఫిదా’ మూవీలో ఈ హైబ్రీడ్ పిల్లకు ఫిదా కాని కుర్రకారు లేరు అంటే అతిశయోక్తికాదు. మలయాళీ అయినప్పటికీ తెలుగు అందులోనూ తెలంగాణ యాసను నేర్చుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ప్రస్తుతం శర్వానంద్‌తో పడిపడి లేచే మనసు సినిమా చేస్తోంది సాయి పల్లవి. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్.
అయితే ఫైనల్ రష్ చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తే బాగుంటుందని దర్శకుడు భావించారట. దీనికి హీరో,నిర్మాతలు పచ్చజెండా కూడా ఊపారు. అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చినా సాయిపల్లవి కొన్ని కండీషన్స్ పెట్టేసింది.
రీషూట్ లో నటించాలంటే అదనపు రోజులు నటించాల్సి ఉంటుంది. అదనంగా నటించినందుకు రెమ్యునరేషన్ ఇవ్వాలని పట్టుబట్టినట్టు సమాచారం. దీనికి నిర్మాతలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి డిసెంబర్ 21 న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్న రీ షూట్ కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని టీ టౌన్ వర్గాల సమాచారం.